బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Sep 23, 2020 , 13:51:03

న్యూ లుక్ లో క‌ట్టిప‌డేస్తున్న‌ 'కంచె' బ్యూటీ..ఫొటోలు వైర‌ల్

న్యూ లుక్ లో క‌ట్టిప‌డేస్తున్న‌ 'కంచె' బ్యూటీ..ఫొటోలు వైర‌ల్

2014లో త‌మిళ సినిమాతో సినీ ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట్రీ ఇచ్చింది జ‌బ‌ల్ పూర్ బ్యూటీ ప్ర‌గ్యా జైశ్వాల్. తెలుగులో క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'కంచె' చిత్రంతో న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఓం న‌మో వెంక‌టేశాయ‌, న‌క్ష‌త్రం, జ‌య జాన‌కి నాయ‌క వంటి చిత్రాల్లో తన న‌ట‌న‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. సోష‌ల్ మీడియాలో అప్ప‌డపుడు క‌నిపించే ఈ భామ తాజాగా ఫొటోషూట్ లో పాల్గొంది. బ్లాక్ షార్ట్‌, టాప్ లో కెమెరాకు పోజులిచ్చిందీ బ్యూటీ.

పొడ‌వాటి కురులు, మెస్మ‌రైజ్ చేసే చూపు, ఆక‌ట్టుకునే అందంతో డిఫ‌రెంట్ షేడ్స్ లో ప్ర‌గ్యాజైశ్వాల్ దిగిన ఫొటోలు క‌ళ్లు ప‌క్క‌కు తిప్పుకోకుండా చేస్తున్నాయి. 2018లో మంచు విష్ణుతో క‌లిసి ఆచార్య అమెరికా యాత్ర చిత్రంలో న‌టించింది ప్ర‌గ్యా. ఈ చిత్రం ఆశించిన విజ‌యం అందుకోలేక‌పోయింది. ఆ త‌ర్వాత మ‌రే సినిమాలో క‌నిపించ‌లేదు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo