వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాండైంది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వైస్ ప్రెసిడెంట్‌గా తన తొలి అంతర్జాతీయ పర్యటనలో భాగంగా గ్వాటెమాలాకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. టాకాఫ్ అయిన కాసేపటికే సమస్య రావడంతో అది తిరిగి వాషింగ్టన్లో జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు వచ్చింది. విమానం నుంచి దిగగానే.. తాను బాగానే ఉన్నట్లు కమలా రిపోర్టర్లకు చెప్పారు. ఆ వెంటనే ఆమె మరో విమానంలో గ్వాటెమాలాకు వెళ్లారు.
కమలా హ్యారిస్ ప్రయాణిస్తున్న విమానంలో ల్యాండింగ్ గేర్ సమస్య తలెత్తినట్లు సిబ్బంది చెప్పారు. అత్యవసరంగా వచ్చిన ముప్పేమీ లేకపోయినా.. ముందు జాగ్రత్తగా తాము విమానాన్ని ల్యాండ్ చేసినట్లు తెలిపారు. ఎయిర్ ఫోర్స్ టూగా పిలిచే ఈ విమానంలో ఏదో శబ్దం వచ్చినట్లు అందులో ప్రయాణిస్తున్న ఓ జర్నలిస్ట్ చెప్పాడు.