గురువారం 28 జనవరి 2021
Cinema - Dec 01, 2020 , 16:43:29

టాటూ వేయించుకున్న‌ పూన‌మ్ కౌర్..!

టాటూ వేయించుకున్న‌ పూన‌మ్ కౌర్..!

టాలీవుడ్ ముద్దుగుమ్మ పూన‌మ్ కౌర్ కొంత‌కాలంగా కొత్త‌కొత్త ఫొటోల‌ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రో స్టిల్ తో అంద‌రినీ ప‌లుక‌రించింది. ఈ సారి తాను టాటూ వేయించుకున్నాన‌ని చెప్తూ ఓ ఫొటోను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. సాధార‌ణంగా త‌మ‌కిష్ట‌మైన వారి పేర్ల‌ను ఎక్కువ‌మంది టాటూ వేయించుకుంటారు. కానీ ఈ భామ మాత్రం ఛాతిపై భాగంలో త్రిశూలాన్ని టాటూగా వేయించుకుంది. పూన‌మ్ కౌర్ శివుడి భ‌క్తురాలు.

పూన‌మ్‌ ఇన్ స్టాగ్రామ్ ను గ‌మ‌నిస్తే భ‌క్తి ఫొటోలు క‌నిపిస్తుంటాయి. హృద‌యంపై త్రిశూలం ఉంటే..నీ నోటి నుంచి ఓం న‌మ శివాయ మంత్రం బ‌య‌ట‌కు వ‌స్తుంది అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. పూన‌మ్ కౌర్ టాటూ వేయించుకున్న ఫొటో ఇపుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo