శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 28, 2020 , 17:07:38

బాయ్ ఫ్రెండ్‌తో పూన‌మ్ బ‌జ్వా..ట్రెండింగ్‌లో స్టిల్స్

బాయ్ ఫ్రెండ్‌తో పూన‌మ్ బ‌జ్వా..ట్రెండింగ్‌లో స్టిల్స్

మొద‌టి సినిమా చిత్రంతో సిల్వ‌ర్ స్క్రీన్ పై మెరిసింది ముంబై భామ పూన‌మ్ బ‌జ్వా. లాక్ డౌన్ స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలో త‌న ఫాలోవ‌ర్ల‌తో వెకేష‌న్ స్టిల్స్ షేర్ చేసుకుంది. తాజాగా ఈ బ్యూటీ త‌న భాయ్ ఫ్రెండ్ ను అంద‌రికీ ప‌రిచ‌యం చేసింది. క్రైమ్ లో, జీవితం, రొమాంటిక్ డేట్, ఆట లో ఇలా అన్నింటిలో నా భాగ‌స్వామి. నువ్వు నా క‌ల‌ల‌న్నీ బ్ర‌హ్మాండంగా ఉండేలా, అన్ని క్ష‌ణాలు మ్యాజిక్ గా చేసే క్రియేట‌ర్ వి. ఆనందం, ఆరోగ్యం, ఉత్సాహం, ప్రేమ‌, స‌ర‌దా, ఉల్లాస‌వంత‌మైన ఈ క్ష‌ణం నుంచి నా ప్ర‌యాణం. నేను ఎప్పుడూ చెప్పే ప‌దాల కంటే నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాను అంటూ..త‌న భాయ్ ఫ్రెండ్ సునీల్ కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపింది.

ఇద్ద‌రూ క‌లిసి స‌ర‌దాగా ఎంజాయ్ చేస్తున్న ఫొటోల‌ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ‌గ‌తేడాది ఎన్టీఆర్‌..కథానాయ‌కుడు చిత్రంలో క‌నిపించిన పూన‌మ్ మ‌రే సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.