శుక్రవారం 23 అక్టోబర్ 2020
Cinema - Aug 24, 2020 , 19:38:00

మ‌రో స్టార్ హీరోకు జోడీగా పూజాహెగ్డే..!

మ‌రో స్టార్ హీరోకు జోడీగా పూజాహెగ్డే..!

హ‌రీష్ శంక‌ర్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబినేష‌న్ లో సినిమాకు స‌న్నాహాలు జరుగుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంతో ప‌వ‌న్ ను ట్రాక్ పైకి తెచ్చిన హ‌రీష్ శంక‌ర్ ఇండ‌స్ట్రీకి మ‌రో బిగ్గెస్ట్ అందించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ను ఎంపిక చేస్తార‌ని వచ్చినా..వాటిపై ఎలాంటి స్ప‌ష్ట‌త రాలేదు. కానీ ఇపుడు మాత్రం హ‌రీష్ శంక‌ర్ పవ‌న్ సినిమాలో పూజా హెగ్డే అయితే బాగుంటుంద‌ని ఫిక్స్ అయ్యాడ‌ట‌. అయితే దీనిపై అధికారికంగా చిత్ర‌యూనిట్ నుంచి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. 

ఈ వార్త నిజ‌మైతే ఇప్ప‌టికే మ‌హేశ్‌బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల‌తో ప‌నిచేసిన పూజా హెగ్డే..ఇక మ‌రో స్టార్ హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌లిసి న‌టించే అరుదైన అవ‌కాశం కొట్టేసిన‌ట్టేనంటున్నారు టాలీవుడ్ సినీ విశ్లేష‌కులు. ప‌వ‌న్ కళ్యాణ్ ప్ర‌స్తుతం వ‌కీల్ సాబ్ చిత్రంతోపాటు క్రిష్ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. 
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo