కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ బీస్ట్. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే విడుదలవగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జులై 1 నుంచి షూటింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టగా.. అందాల సోయగం పూజాహెగ్డే సినిమా కోసం చెన్నైలో ల్యాండ్ అయిందట. త్వరలోనే లొకేషన్ కు వచ్చి షూటింగ్లో చేరిపోనుందని కోలీవుడ్ సర్కిల్ టాక్. రాబోయే షెడ్యూల్ 20 రోజులపాటు ప్లాన్ చేశారు డైరెక్టర్ నెల్సన్ అండ్ మేకర్స్ టీం.
ఈ షెడ్యూల్లో విజయ్-పూజాహెగ్డేపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. వచ్చే సంక్రాంతికి బీస్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. నెల్సన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. పూజాహెగ్డే.. ప్రభాస్తో కలిసి నటించిన రాధేశ్యామ్, అఖిల్ అక్కినేనితో చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రాలు రిలీజ్ కావాల్సి ఉండగా..లాక్డౌన్ ఎఫెక్ట్ తో నిలిచిపోయాయి.
ఇవి కూడా చదవండి..
చిరంజీవి సినిమాలో క్రేజీ బాలీవుడ్ స్టార్..!
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
Recommended Content by ntnews.com