బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Sep 25, 2020 , 06:47:44

పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రైన‌ పాయ‌ల్ ఘోష్

పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రైన‌ పాయ‌ల్ ఘోష్

బాలీవుడ్ న‌టి పాయ‌ల్ పాయ‌ల్ ఘోష్ ఇటీవ‌లే ద‌ర్శ‌కుడు అనురాగ్ కాశ్య‌ప్ పై లైంగిక దాడి ఆరోప‌ణ‌లు చేయ‌గా..ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేష‌న్ లో రేప్ కేసు న‌మోద చేసిన సంగ‌తి తెలిసిందే. అనురాగ్ కాశ్య‌ప్ పై ఐపీసీ సెక్ష‌న్ 341, 342, 354, 376 ల కింద కేసు న‌మోదైంది. ఈ నేప‌థ్యంలో విచార‌ణ నిమిత్తం పాయ‌ల్ కు పోలీసులు స‌మ‌న్లు జారీచేశారు. ఈ నేప‌థ్యంలో పాయ‌ల్ పోలీసుల ఎదుట హాజ‌రైంది. 5- 6 ఏండ్ల క్రితం అనురాగ్ కాశ్య‌ప్ నివాసంలో పాయ‌ల్‌కు, అత‌నికి మ‌ధ్య మొద‌టిసారి ఏం జ‌రిగింద‌నే విష‌యంపై పోలీసులు విచార‌ణ‌లో ఆరా తీసిన‌‌ట్టు తెలుస్తోంది.

త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌లను అనురాగ్ కాశ్య‌ప్ ఇప్ప‌టికే తోసిపుచ్చారు. ప్ర‌స్తుత ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ‌కుండా ఉండేందుకే రాజ‌కీయ కుట్రలో భాగంగానే తన‌పై ఇలాంటి ఆరోప‌ణ‌లు సృష్టిస్తున్నార‌ని చెప్పాడు. త‌న నిజాయితీని నిరూపించేందుకు న్యాయ‌నిపుణుల‌ను సంప్ర‌దిస్తాన‌ని చెప్పాడు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo