శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Oct 09, 2020 , 21:23:51

హైద‌రాబాద్ ఎయిర్‌పోర్టులో నిత్య‌మీన‌న్..వీడియో

హైద‌రాబాద్ ఎయిర్‌పోర్టులో నిత్య‌మీన‌న్..వీడియో

లాక్ డౌన్ ఎఫెక్ట్ తో కుటుంబంతో స‌ర‌దాగా గ‌డిపిన తార‌లంతా ఇప్పుడు ఒక్కొక్క‌రిగా షూటింగ్ ల‌తో బిజీ అయిపోతున్నారు. గ‌త 6 నెల‌లుగా ఇంటి పట్టునే ఉన్న టాలీవుడ్ హీరోయిన్లు ఇపుడు షూటింగ్ కోసం హైద‌రాబాద్ కు వ‌చ్చేస్తున్నారు. ఇటీవ‌లే శృతిహాస‌న్ ముంబై లోని నివాసం నుంచి హైద‌రాబాద్ కు వ‌చ్చి షూటింగ్ లో పాల్గొంటున్న విష‌యం తెలిసిందే. మ‌రోవైపు లావ‌ణ్య‌త్రిపాఠి కూడా న‌గ‌రానికి వ‌చ్చేసింది. ఇపుడు మ‌రో భామ నిత్య‌మీన‌న్ కూడా భాగ్య‌న‌గ‌రంలో ప్ర‌త్యక్ష‌మైంది. అయితే నిత్య‌మీన‌న్ ఎక్క‌డికెళ్తుంద‌నేది తెలియాల్సి ఉంది. 

బ్లూ జంప్ షూట్ లో ఉన్న నిత్య‌మీన‌న్ హైద‌‌రాబాద్ (శంషాబాద్‌) ఎయిర్ పోర్టులో నుంచి న‌డుచుకుంటూ వ‌స్తుండ‌గా..ఈ బ్యూటీని అక్క‌డే ఉన్న రిపోర్ట‌ర్లు త‌మ కెమెరాల్లో బంధించారు. నిత్య‌మీన‌న్ ఎయిర్ పోర్టు లో క‌నిపించిన వీడియో నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. నిత్య‌మీన‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న గ‌మ‌నం నుంచి ఇటీవ‌లే ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. గ‌తేడాది మిష‌న్ మంగ‌ళ్ చిత్రంతో బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.