శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 18, 2020 , 14:34:13

క్లాసిక్ లుక్ లో నిత్య‌మీన‌న్‌..ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్

క్లాసిక్ లుక్ లో నిత్య‌మీన‌న్‌..ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్

శ్రియ‌ లీడ్ రోల్ లో న‌టిస్తోన్న పాన్ ఇండియా చిత్రం గ‌మ‌నం. తాజాగా ఈ మూవీ నుంచి నిత్య‌మీన‌న్ ఫ‌స్ట్ లుక్ ను టాలీవుడ్ యాక్ట‌ర్ శ‌ర్వానంద్ విడుద‌ల చేశారు.  క్లాసిక‌ల్ సింగ‌ర్ శైల‌పుత్రీ దేవి పాత్ర‌లో క‌నిపిస్తున్న పోస్ట‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. సుజ‌నారావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నిత్య‌మీన‌న్‌, ప్రియాంకా జ‌వాల్క‌ర్, శివ కందుకూరి కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. 

ఈ సినిమాకు ప్రముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు స‌మ‌కూరుస్తున్నారు. జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తూ..మ‌రోవైపు ర‌మేష్ క‌రుటూరి, వెంకీ పుష‌డ‌పు ల‌తో క‌లిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ‌'గ‌మ‌నం' చిత్రానికి సంబంధించి ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన శ్రియకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌వ‌గా..ఈ పోస్ట‌ర్‌లో చీర క‌ట్టుకొని, మెడ‌లో మంగ‌ళ‌సూత్రం మాత్ర‌మే ఉన్న ఒక అతి సాధార‌ణ గృహిణిలా క‌నిపిస్తుంది శ్రియ‌. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.