శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 22, 2020 , 15:09:53

సింగిల్ స్టేట‌స్ మార‌లేదు..నో డేటింగ్‌: నిధి అగ‌ర్వాల్

సింగిల్ స్టేట‌స్ మార‌లేదు..నో డేటింగ్‌: నిధి అగ‌ర్వాల్

లాక్ డౌన్ కాలంలో సింగిల్ గా ఉన్న తార‌ల్లో కొంత‌మంది రిలేష‌న్ షిప్ మెయింటెయిన్ చేయ‌డమో, పెండ్లి చేసుకోవ‌డ‌మో చేశారు. అయితే తాను మాత్రం ఈ రెండు జాబితాల్లో ఉండ‌నంటోంది ఇస్మార్ట్ భామ నిధిఅగ‌ర్వాల్‌. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో  పెద్ద సంఖ్య‌లో ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంది నిధి‌. లాక్ డౌన్ సమ‌యంలో తాను రొమాంటిక్ రిలేష‌న్ షిప్ కోసం చూడ‌లేదని చెప్పింది. అంతేకాదు లాక్ డౌన్ పీరియ‌డ్ త‌న సింగిల్ స్టేట‌స్ ఏం మార్చ‌లేద‌ని చెప్పింది. నిధి ఓ తెలుగు స్టార్ యాక్ట‌ర్ తో డేటింగ్ లో ఉన్న‌ట్టు వ‌చ్చిన వార్త‌లను కొట్టిపారేసింది.

ఈ బ్యూటీ ప్ర‌స్తుతం అశోక్ గ‌ల్లా డెబ్యూట్ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తోంది. శింబుతో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. త్రినాథ రావు న‌క్కిన డైరెక్ష‌న్ లో  ర‌వితేజ హీరోగా రానున్న సినిమాలో నిధిఅగ‌ర్వాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేయాల‌ని భావిస్తున్నారు మేక‌ర్స్‌. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.