ఆదివారం 01 నవంబర్ 2020
Cinema - Sep 19, 2020 , 18:02:25

న‌య‌న్-విఘ్నేశ్ ఫ‌న్ టైం వీడియో‌

న‌య‌న్-విఘ్నేశ్ ఫ‌న్ టైం వీడియో‌

న‌య‌న‌తార-విఘ్నేష్ శివ‌న్‌..ఇండ‌స్ట్రీలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోన్న సెల‌బ్రిటీల్లో టాప్ ప్లేస్ లో ఉంటారు. చాలా కాలంగా డేటింగ్ లో ఉన్న ఈ ఇద్ద‌రూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్ప‌టిక‌పుడు స‌ర‌దా క్ష‌ణాలను అభిమానుల‌తో పంచుకుంటారు. ఇటీవ‌లే న‌య‌న‌తార స్వ‌స్థ‌లం కోచిలో ఓన‌మ్ సెల‌బ్రేష‌న్స్ లో కూడా పాల్గొన్నారు. ఆ ఫొటోలు కూడా వైర‌ల్ అయ్యాయి. ఇపుడు ఈ క్రేజీ క‌పుల్ ఎక్క‌డున్నారో తెలుసా..? వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ టూరిజం డెస్టినేష‌న్ గోవా. విఘ్నేశ్ శివ‌న్ బ‌ర్త్ డే పార్టీ సంద‌ర్బంగా..అక్క‌డి లొకేష‌న్ లో తీసిన వీడియో ఇపుడ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చల్ చేస్తోంది.

న‌య‌నతార సోఫాలో బ్లాక్ డ్రెస్ లో ఉన్న న‌య‌న‌తార సోఫాలో కూర్చొని ఫోన్ లో చూస్తుంటే..విఘ్నేశ్ వీడియో తీస్తున్నాడు. విఘ్నేశ్ ను చూస్తూ న‌య‌న్ న‌వ్వ‌డం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.