శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 30, 2020 , 17:27:24

ఐటెంసాంగ్ లో మెరువ‌నున్న నందినీరాయ్ !

ఐటెంసాంగ్ లో మెరువ‌నున్న నందినీరాయ్ !

2011లో వ‌చ్చిన ఫ్యామిలీ ప్యాక్ (హిందీ)సినిమాతో సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైంది హైద‌రాబాదీ భామ నందినీరాయ్. ఆ త‌ర్వాత ప‌లు తెలుగు చిత్రాల్లో న‌టించింది. ఈ భామ కోతికొమ్మ‌చ్చి సినిమాలో ఐటెంసాంగ్ లో మెరువ‌నున్న‌ట్టు టాలీవుడ్ లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. చేతిలో స‌రైన ఆఫ‌ర్లు లేని ఈ ముద్దుగుమ్మ ఐటెంసాంగ్ తోనైనా త‌న కెరీర్ ను గాడిలో పెట్టుకోవాలనుకుంటుంద‌ట‌. సుధీర్ బాబు న‌టించిన మోస‌గాళ్ల‌కు మోస‌గాడు, మాయ చిత్రాల్లో మెరిసింది నందినీరాయ్‌. నాని హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన బిగ్ బాస్ 2లో కంటెస్టెంట్ గా క‌నిపించింది. 

శ్రీహ‌రి కుమారుడు మేఘాంశ్‌, సామ్ వేగేశ్న కాంబినేష‌న్ లో వ‌స్తోన్న చిత్రం కోతి కొమ్మ‌చ్చి. స‌తీశ్ వేగేశ్న డైరెక్ష‌న్ లో వ‌స్తోన్న ఈ చిత్రంలో రిద్ధికుమార్, మేఘా చౌద‌రి హీరోయిన్లు కాగా..రాజేంద్ర‌ప్ర‌సాద్‌, న‌రేశ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.