గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 22, 2020 , 18:26:28

డ్ర‌గ్స్ కేసు..తెర‌పైకి నమ్ర‌త‌, దియా మీర్జా పేర్లు..!

డ్ర‌గ్స్ కేసు..తెర‌పైకి నమ్ర‌త‌, దియా మీర్జా పేర్లు..!

ముంబై డ్ర‌గ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు విచార‌ణ కొన‌సాగిస్తోన్న సంగ‌తి తెలిసిందే. విచార‌ణ‌లో రియా చ‌క్ర‌వ‌ర్తి ప‌లువురు హీరోయిన్ల పేర్లు చెప్పిన విష‌యం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో మ‌హేశ్ బాబు స‌తీమ‌ణి, న‌టి న‌మ్ర‌త శిరోద్క‌ర్ పేరు జాతీయ మీడియాలో తెర‌పైకి వ‌చ్చింది. టాలెంట్ మేనేజ‌ర్ జ‌య సాహాతో న‌మ్ర‌త డ్ర‌గ్స్ గురించి చాటింగ్ చేసిన‌ట్టు త‌న క‌థ‌నంలో పేర్కొంది. బాంబేలో మంచి ఎండీ ఇస్తావ‌ని ప్రామిస్ చేశావ్‌.. ఎండీ ఇచ్చాక మ‌నం క‌లిసి పార్టీ చేసుకుందాం అని న‌మ్ర‌త చాట్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు జ‌య‌సాహాను విచారిస్తున్న క్ర‌మంలో న‌మ్ర‌త శిరోద్క‌ర్ పేరు చెప్పిన‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు బాలీవుడ్ న‌టి దియా మీర్జా పేరు కూడా లైమ్ లైట్ లోకి వ‌చ్చింది. 2019లో దియా డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్టుగా గుర్తించిన‌ట్టు స‌మాచారం. ఈ మేర‌కు ఎన్సీబీ అధికారులు దియామీర్జా, ఆమె మేనేజ‌ర్ను విచార‌ణ‌కు పిలిచే అవ‌కాశ‌మున్న‌ట్టు తెలుస్తోంది. రానున్న కాలంలో ఇంకెంత‌మంది సెల‌బ్రిటీల పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తాయో చూడాలి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo