మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Oct 09, 2020 , 19:39:00

బ్యాట్ మ్యాన్ చిత్రాన్ని గీసిన 'ఇస్మార్ట్' భామ

బ్యాట్ మ్యాన్ చిత్రాన్ని గీసిన 'ఇస్మార్ట్' భామ

టాలీవుడ్ లో అందం, అభిన‌యంలో అంద‌రికీ గట్టి పోటీనే ఇస్తుంది న‌భా న‌టేశ్‌. సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫాం ద్వారా హీరోయిన్లు త‌మ‌కున్న స్కిల్స్ ను అప్ప‌డ‌పుడు ఫాలోవ‌ర్ల‌తో షేర్ చేసుకుంటార‌నే సంగ‌తి తెలిసిందే. ఇపుడు న‌భా న‌టేశ్ కూడా త‌నలో ఉన్న చిత్ర‌కళ‌ను అంద‌రి ముందు ప్ర‌ద‌ర్శించింది. హాలీవుడ్ చిత్రాల్లో అల‌రించే పాపుల‌ర్ రోల్ బ్యాట్ మ్యాన్ చిత్రాన్ని కండ్ల‌కు క‌ట్టిన‌ట్టు వేసి ఔరా అనిపించింది. 

నేను చేసిన ప‌ని..న‌న్ను నిర్వ‌చిస్తుంది. బ్రూస్ వానే, బ్యాట్‌మ్యాన్, యాన్ ఓడ్ టు బ్యాట్ మ‌న్ త‌గిన‌దీ పెయింట్‌. ఇది గీయ‌డానికి 6-7 సెష‌న్లు ప‌ట్టింది.పూర్త‌యే వ‌ర‌కు చాలా హ్యాపీగా పెయింటింగ్ చేశా.  ఒక‌వేళ మీరు బ్యాట్ మ్యాన్ అభిమాని అయితే నేను గీసిన చిత్రాన్ని చూసి గ‌ర్వంగా ఫీల‌వుతారు అని ఇన స్టాగ్రామ్ హ్యాండిల్ లో క్యాప్ష‌న్ ఇచ్చింది. న‌భా న‌టేశ్ ప్ర‌స్తుతం సోలో బ్ర‌తుకే సో బెట‌రు, అల్లుడు అదుర్స్ చిత్రాల్లో న‌టిస్తోంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo