ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 09, 2020 , 14:45:45

స్లిమ్ గా మారేందుకు జిమ్‌లో చెమ‌టోడుస్తున్న లావ‌ణ్య‌ త్రిపాఠి

స్లిమ్ గా మారేందుకు జిమ్‌లో చెమ‌టోడుస్తున్న లావ‌ణ్య‌ త్రిపాఠి

లాక్ డౌన్ తో కొన్నాళ్లుగా హైద‌రాబాద్ లోనే ఉండిపోయిన లావ‌ణ్య త్రిపాఠి..ప‌రిస్థితులు స‌ద్దుమ‌ణిగాక తిరిగి స్వ‌స్థ‌లం డెహ్రాడూన్ కు వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ త‌న కుటుంబంతో క‌లిసి స‌ర‌దాగా గ‌డిపిన ఈ భామ మ‌ళ్లీ ఇటీవ‌లే హైద‌రాబాద్ కు తిరిగొచ్చేసింది. లాక్ డౌన్ టైంలో మంచి ఆహారం తీసుకుంటూ తీరిక‌గా గ‌డిపిన ఈ భామ ఇపుడు స్లిమ్ గా త‌యార‌యేందుకు జిమ్ కు వెళ్ల‌డం షురూ చేసింది. లావ‌ణ్య ప్ర‌స్తుతం సందీప్ కిష‌న్ తో క‌లిసి  ఏ 1 ఎక్స్ ప్రెస్ సినిమాతో పాటు కార్తికేయ న‌టిస్తున్న చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రంలో హీరోయిన్ గా క‌నిపించ‌నుంది.

లాక్ డౌన్ కు ముందు సినిమాల్లో స్లిమ్ గా క‌నిపించిన ఈ అందాల తార ఇపుడు మ‌ళ్లీ అదే ఫిట్ నెస్ ను మెయింటైన్ చేసేందుకు జిమ్ లో చెమ‌టోడుస్తుంది. ప్ర‌త్యేక ఫిజిక‌ల్ ట్రైన‌ర్ స‌మ‌క్షంలో వ‌ర్క‌వుట్స్ చేస్తోంది. జిమ్ ఫొటోల‌ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ అమ్మ‌డు.. “ఆపండి..గుర్తు తెచ్చుకోండి. నెమ్మ‌దిగా, మీరు ఎక్క‌డికి వెళ్లాలో తెలుస్తుంది. అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది ” 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo