ఆదివారం 01 నవంబర్ 2020
Cinema - Sep 28, 2020 , 19:14:25

ట్రెండీ లుక్ లో కీర్తిసురేశ్..ఫొటోలు వైర‌ల్‌

ట్రెండీ లుక్ లో కీర్తిసురేశ్..ఫొటోలు వైర‌ల్‌

మహాన‌టి చిత్రంలో అందం, అభిన‌యంతో సావిత్రిని మ‌రిచిపోయేలా చేసింది అందాల తార కీర్తిసురేశ్‌. ఈ చిత్రంతో స్టార్ హీరోయిన్లు జాబితాలో చేరిపోయింది. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీబిజీగా ఉంది.  సంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో ఎక్కువ క‌నిపించే ఈ బ్యూటీ తాజాగా ఎయిర్ పోర్టులో స‌రికొత్త అవ‌తారంలో క‌నిపించి..అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయేలా చేసింది. వైట్ ప్యాంట్ విత్ బ్లాక్ లైన్స్, బ్లాక్ అండ్ వైట్ టాప్ లో మెరిసి సంద‌డి చేసింది. క‌ర్లీ హెయిర్ స్టైల్ తో తెలుపు రంగు మాస్క్,  బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని ఎయిర్ పోర్టులో నుంచి న‌డిచి వ‌స్తుండ‌గా అక్క‌డున్న కెమెరాలు క్లిక్‌మ‌నిపించాయి.

ట్రెండీ వ‌స్త్ర‌ధార‌ణ‌తో న‌యా లుక్ తో ఉన్న కీర్తిసురేశ్ ఫొటోలు ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. పెంగ్విన్ సినిమా ఓటీటీ ప్లాట్ ఫాంలో విడుద‌ల‌వ్వ‌గా మంచి టాక్ తెచ్చుకుంది. మ‌రోవైపు గుడ్ ల‌క్ స‌ఖి అనే చిత్రంలో కూడా న‌టిస్తోంది కీర్తిసురేశ్‌. న‌గేశ్ కుకునూర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.