న్యూఢిల్లీ: హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో (హెచ్సీఎల్)లో ఖాలీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తికలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆఫ్లైన్ దరఖాస్తులు జూలై 15 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈనోటిఫికేషన్ ద్వారా 21 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ఎలక్ట్రిషన్ గ్రేడ్-2, ఎలక్ట్రిషన్ కమ్ లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. ఎంపికైనవారు కోల్కతాలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 21
ఇందులో ఎలక్ట్రిషన్ 20, ఎలక్ట్రిషన్ కమ్ లైబ్రేరియన్ 1 చొప్పన ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఐఐటీలో ఎలక్ట్రిషన్ ట్రేడ్ చేసి ఉండాలి. అనుభవం తప్పనిసరి.
అప్లికేషన్ విధానం: ఆఫ్లైన్లో. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని దానిని పూర్తిగా నింపి సంబంధిత చిరునామాకు పంపించాలి.
అడ్రస్: Hindustan Copper Limited, Tamra Bhawan, 1, Ashutosh Chowdhary Avenue, Kolkata – 700019.
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 15
వెబ్సైట్: https://www.hindustancopper.com/