గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Oct 18, 2020 , 16:10:46

గ్రామంలో కీర్తిసురేశ్‌..మేకింగ్ వీడియో

గ్రామంలో కీర్తిసురేశ్‌..మేకింగ్ వీడియో

మ‌హాన‌టి చిత్రంలో త‌న న‌ట‌న‌తో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కీర్తిసురేశ్. ఈ బ్యూటీ తాజాగా గుడ్ ల‌క్ స‌ఖి చిత్రంలో న‌టిస్తోంది. న‌గేశ్ కుకునూర్ ద‌ర్శ‌క‌త్వంలో  గ్రామీణ నేప‌థ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కుతుంది. ఆదిపినిశెట్టి హీరోగా న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌ల ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్..టీజ‌ర్ కు మంచి స్పంద‌న వ‌స్తోంది. అయితే కీర్తిసురేశ్ బ‌ర్త్ డే (అక్టోబ‌ర్ 17న‌) సంద‌ర్భంగా ఆమెకు శుభాకాంక్ష‌లు తెలుపుతూ చిత్ర‌యూనిట్ స్పెష‌ల్ మేకింగ్ వీడియోను విడుద‌ల చేసింది.

లొకేష‌న్స్ లో కొన్ని సీన్లను చిత్రీక‌రిస్తుండ‌గా..కీర్తిసురేశ్ స‌ర‌దాగా ఎంజాయ్ చేయ‌డం వీడియోలో చూడొచ్చు. జ‌గ‌ప‌తిబాబు కీర్తిసురేశ్ కు బాణం ఎలా ఎక్కుపెట్టాలో నేర్ప‌డం కూడా క‌నిపిస్తుంది. ఈ చిత్రంలో కీర్తిసురేశ్ కోచ్ గా జ‌గ‌ప‌తిబాబు క‌నిపించ‌నున్నారు.  లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo