మంగళవారం 24 నవంబర్ 2020
Cinema - Oct 28, 2020 , 12:27:50

చిరంజీవి మూవీ..కీర్తిసురేశ్ కు భారీ పారితోషికం ..!

చిరంజీవి మూవీ..కీర్తిసురేశ్ కు భారీ పారితోషికం ..!

టాలీవుడ్ యాక్ట‌ర్ చిరంజీవి త‌మిళ సూప‌ర్ హిట్ సినిమా వేదాళ‌మ్ రీమేక్ లో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. మెహ‌ర్ ర‌మేశ్ డైరెక్ష‌న్ లో రానున్న ఈ మూవీలో చిరంజీవి సోద‌రి పాత్ర‌లో కీర్తిసురేశ్ ను ఫైన‌ల్ చేసిన‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. అయితే కీర్తిసురేశ్ ఈ చిత్రం కోసం భారీ మొత్తంలోనే రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తోంద‌న్న న్యూస్ ఫిలింన‌గర్ లో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు కీర్తిసురేశ్ డిమాండ్ ను మేక‌ర్స్ అంగీక‌రించార‌ట‌. ముందుగా ఈ పాత్ర కోసం సాయిప‌ల్ల‌విని అనుకున్నారు. కానీ సాయిప‌ల్ల‌వి కొంత చిన్న వ‌య‌స్సుగా క‌నిపించడంతో..కీర్తిసురేశ్ ను ఒకే చేసింద‌ని టాక్.

అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2021 జన‌వ‌రిలో ఈ మూవీ షూటింగ్ మొద‌లు కానున్న‌ట్టు స‌మాచారం. మొత్తానికి త‌క్కువ టైంలోనే కీర్తిసురేశ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో న‌టించే అరుదైన అవ‌కాశం కొట్టేయ‌డ‌మే కాకుండా..భారీ రెమ్యున‌రేష‌న్ కూడా ఇంటికి తీసుకెళ్తుందంటూ గుస‌గుస‌లాడుకుంటున్నారు సినీ జ‌నాలు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.