ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Cinema - Jan 22, 2021 , 16:21:10

మ‌హేశ్ కోసం దుబాయ్ కి కీర్తిసురేశ్..ఇదిగో ప్రూఫ్!

మ‌హేశ్ కోసం దుబాయ్ కి కీర్తిసురేశ్..ఇదిగో ప్రూఫ్!

టాలీవుడ్ భామ కీర్తిసురేశ్ ప్ర‌స్తుతం మ‌హేశ్‌బాబుతో క‌లిసి స‌ర్కారు వారి పాట సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప‌ర‌శురాం డైరెక్ష‌న్ లో వ‌స్తోన్న ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్ దుబాయ్ లో త్వ‌ర‌లోనే షురూ కానుంది. ఇప్ప‌టికే మ‌హేశ్‌బాబు త‌న స‌తీమ‌ణి న‌మ్ర‌త‌, గౌత‌మ్, సితార‌తో దుబాయ్‌కు వెళ్లిపోయాడు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో కీర్తిసురేశ్ కూడా జాయిన్ కావాల్సి ఉంది. ఈ   మూవీ కోసం దుబాయ్‌కు ప‌య‌న‌మ‌వుతుందీ మ‌హాన‌టి హీరోయిన్.

త‌న క్యూటీ పెట్‌ను వ‌దిలిపెట్టి టౌన్ దాటి వెళ్ల‌డం చాలా క‌ష్టంగా ఉందంటూ ట్విట‌ర్ లో పోస్ట్ పెట్టింది. 'నీకు గుడ్‌బై చెప్ప‌డం క‌ష్టం. నేను ప‌ని నిమిత్తం టౌన్ దాటి వెళ్లే ప్ర‌తీ సారి నా హృదయం బ‌ద్ద‌లవుతుంది. నేను తిరిగొచ్చిన త‌ర్వాత నిన్ను గ‌ట్టిగా కౌగించుకునేంత‌వ‌ర‌కు..బ‌రువెక్కిన హృద‌యంతో నిన్ను చాలా మిస్స‌వుతున్నా బేబి. నీతో ఉన్న ప్ర‌తీ రోజు హ‌గ్గింగ్ డే. హ‌గ్గింగ్ ఫేస్. దుబాయ్‌కు మ‌ళ్లీ వ‌స్తున్నా'నంటూ ట్వీట్ చేసింది. కీర్తిసురేశ్ త‌న పెట్ ను ముద్దాడుతూ..నిను విడిచి ఉండ‌టం క‌ష్ట‌మ‌ని చెబుతూ పెట్టిన ఎమోష‌న‌ల్ పోస్ట్ ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

ఇవి కూడా చ‌ద‌వండి..

మ‌హేశ్ దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!

కీర్తిసురేశ్ లుక్ మ‌హేశ్‌బాబు కోసమేనా..?

మ‌హేశ్ బాబు స్కిన్ స్పెష‌లిస్ట్ ఈమెనే..!

ఈ శుక్రవారం కొత్త సినిమా రిలీజ్‌లు లేవు..కార‌ణ‌మేంటో ?

స‌మంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo