శనివారం 06 మార్చి 2021
Cinema - Jan 26, 2021 , 16:21:44

కీర్తిసురేశ్ ఏడేళ్ల క‌ల నెర‌వేరిన వేళ‌..!

కీర్తిసురేశ్ ఏడేళ్ల క‌ల నెర‌వేరిన వేళ‌..!

యాక్టింగ్‌లో మ‌హాన‌టి చిత్రానికి ముందు..ఆ త‌ర్వాత అని  సినీ జ‌నాలు మాట్లాడుకునేలా చేసింది కోలీవుడ్ భామ‌ కీర్తిసురేశ్‌. మ‌హాన‌టి చిత్రంలో త‌న న‌ట‌న‌తో దేశ‌వ్యాప్తంగా ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుని..స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది కీర్తిసురేశ్‌.. ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో తీరిక‌లేకుండా ఉంది. ఈ బ్యూటీ మ‌రో కొత్త సినిమాతో ఆడియెన్స్ ను అల‌రించేందుకు ముస్తాబ‌వుతోంది. అయితే కీర్తి ఈ సారి  మ‌ల‌యాళ సినిమాలో న‌టిస్తోంది.

ఈ చిత్రానికి కీర్తిసురేశ్ త‌ల్లిదండ్రులు సురేశ్‌కుమార్‌, రేవ‌తి నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం విశేషం. టొవినో థామ‌స్ ఈ ప్రాజెక్టులో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. జీ సురేశ్ కుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో రేవ‌తి క‌ళామందిర్‌పై (హోం బ్యాన‌ర్)పై తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని విష్ణు జీ రాఘ‌వ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టు చేస్తుండ‌టం ప‌ట్ల‌ చాలా ఎక్జ‌యిటింగ్ కు లోనవుతున్న‌ట్టు తెలిపింది కీర్తి.  

 ‌'ఇది  నా హృద‌యానికి ద‌గ్గ‌రైన సినిమా. ఓ అమ్మాయికి తండ్రి నిర్మిస్తున్న సినిమాలో న‌టించే అవకాశం రావ‌డం అంత సుల‌భ‌మైన‌దేమి కాదు. వాషిని మీకు ప‌రిచ‌యం చేస్తూ..ఈ సినిమా చేయ‌డానికి నాకు ఏడేళ్లు ప‌ట్టింది. నా క‌ల ఏడేళ్ల‌కు సాకారం కాబోతుంద‌ని‌' తెలిపింది కీర్తిసురేశ్‌. మొత్తానికి నాన్న‌తో క‌లిసి సినిమా చేయాల‌న్న క‌ల ఇన్నాళ్ల‌కు నెరవేరినందుకు హ‌ర్షం వ్య‌క్తంచేస్తున్నారు కీర్తి ఫ్యాన్స్. ఇవి కూడా చ‌ద‌వండి..

సెట్స్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వీడియో వైర‌ల్

ర‌వితేజ బ‌ర్త్‌డే .. ఖిలాడి ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల‌

కూలీ నెం 1 సాంగ్ కు శ్ర‌ద్దాదాస్ డ్యాన్స్..వీడియో

పుష్ప స్పెష‌ల్ సాంగ్ లో 'బ్లాక్ రోజ్' బ్యూటీ?

శ్ర‌ద్దాదాస్ సొగ‌సు చూడ‌త‌ర‌మా

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన మేకర్స్

'స‌ర్కారు వారి పాట' ఖాతాలో స‌రికొత్త రికార్డ్

హాట్ లుక్ లో సారా హొయ‌లు..ట్రెండింగ్‌లో స్టిల్స్

మ‌హేశ్ బాబు స్కిన్ స్పెష‌లిస్ట్ ఈమెనే..!


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo