గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Oct 05, 2020 , 21:03:32

కాజ‌ల్ కు కాబోయే భ‌ర్త ఇత‌డే..!

కాజ‌ల్ కు కాబోయే భ‌ర్త ఇత‌డే..!

టాలీవుడ్ క‌లువ క‌ళ్ల సుంద‌రి కాజ‌ల్ పెళ్లి వార్త ఇప్ప‌టికే నెట్టింట్లో వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. కాజ‌ల్‌ త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతుంద‌ని, ఈ బ్యూటీ సీక్రెట్ గా ‌ఓ వ్యాపార‌వేత్త‌తో ఎంగేజ్ మెంట్ పూర్తి చేసుకుంద‌ని న్యూస్ చ‌క్క‌ర్లు కొట్టింది. ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన వార్త‌లు నిజ‌మేన‌ని తాజాగా క‌నిపిస్తున్న ఫొటో చూస్తే అర్థ‌మ‌వుతుంది. ముంబై మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాల ప్ర‌కారం కాజ‌ల్ బిజినెస్ మెన్ గౌత‌మ్ కిచ్లూలుతో ఎంగేజ్ మెంట్ అయిన‌ట్టు క‌థ‌నాల సారాంశం. డిస్ సెర్న్ లివింగ్ అనే ఇంటీరియ‌ర్ కంపెనీని నిర్వ‌హిస్తున్నాడు గౌత‌మ్‌. అంతేకాదు గౌత‌మ్‌, కాజ‌ల్ చాలా కాలంగా డేటింగ్ లో కూడా ఉన్నార‌ట‌.

కాజ‌ల్ త్వ‌ర‌లోనే వెడ్డింగ్ ప్లాన్ ప్ర‌క‌టిస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 2021 ఫ‌స్ట్ హాఫ్ లో కాజ‌ల్ పెళ్లికి ముహూర్తం ఫిక్స‌వ్వ‌నున్న‌ట్టు తెలుస్తోంది. చిరంజీవితో న‌టిస్తోన్న ఆచార్య‌, క‌మ‌ల్ హాస‌న్ తో చేస్తోన్న ఇండియ‌న్ -2 చిత్రాల‌ను ఈ లోపే పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటున్న‌ట్టు ఇన్ సైడ్ టాక్‌. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo