శనివారం 16 జనవరి 2021
Cinema - Dec 02, 2020 , 13:13:02

ముగ్గురు హీరోయిన్ల‌తో కాజ‌ల్ హార్ర‌ర్ థ్రిల్ల‌ర్..!

ముగ్గురు హీరోయిన్ల‌తో కాజ‌ల్ హార్ర‌ర్ థ్రిల్ల‌ర్..!

టాలీవుడ్ క‌లువు క‌ళ్ల సుంద‌రి కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న భ‌ర్త గౌత‌మ్ కిచ్లూతో మాల్దీవులు వెకేష‌న్ కు వెళ్లిన విష‌యం తెలిసిందే. కాజ‌ల్ హ‌నీమూల్ ట్రిప్ కు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేశాయి.తాజాగా ఈ భామ త‌మిళంలో ఓ హార్ర‌ర్ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇటీవ‌లే చెన్నైకు వెళ్లిన కాజ‌ల్ క‌థ విని వెంటనే ఒకే చేసింద‌ట‌. అంతేకాదు త‌న పాత్ర కోసం లుక్ టెస్ట్ కూడా చేయించుకుంద‌ట‌. ఆస‌క్తిక‌ర విష‌య‌మేంటంటే ఈ చిత్రంలో కాజ‌ల్ తో మ‌రో ముగ్గురు హీరోయిన్లు కీ రోల్స్ పోషిస్తున్న‌ట్టు టాక్‌. మ‌రి మిగిలిన ఆ ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రనే దానిపై త్వ‌ర‌లోనే స్ప‌ష్ట‌త వచ్చే అవ‌కాశ‌ముంది.

గ‌తంలో క‌వ‌లై వేండ‌మ్ సినిమా చేసిన డైరెక్ట‌ర్ డీక‌య్ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నాడు. కాజ‌ల్ అతి త్వ‌ర‌లోనే చిరంజీవి తో క‌లిసి ఆచార్య షూటింగ్ లో జాయిన్ కానుంది. ఇక క‌మ‌ల్ హాస‌న్-శంక‌ర్ ప్రాజెక్టు ఇండియ‌న్ 2 లో కూడా న‌టిస్తోంది. దుల్హ‌ర్ స‌ల్మాన్ తో హే సినామిక చిత్రంతోపాటు బాలీవుడ్ లో ముంబై సాగా చిత్రం చేస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.