బుధవారం 03 మార్చి 2021
Cinema - Jan 18, 2021 , 19:34:36

వెడ్డింగ్ ఫొటోలు షేర్ చేసిన కాజ‌ల్

వెడ్డింగ్ ఫొటోలు షేర్ చేసిన కాజ‌ల్

అక్టోబ‌ర్ 2020లో వివాహ‌బంధంతో ఒక్క‌ట‌య్యారు కాజ‌ల్ అగ‌ర్వాల్, గౌత‌మ్ కిచ్లూ. ఆ త‌ర్వాత మాల్దీవుల్లో హ‌నీమూన్ ట్రిప్ వేశారు. కాజ‌ల్‌-గౌత‌మ్ హ‌నీమూన్ ట్రిప్ స్టిల్స్ ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కూడా అయ్యాయి. Ask Me Anything సెష‌న్ లో భాగంగా త‌న వెడ్డింగ్ ఆల్బ‌మ్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు షేర్ చేయ‌ని ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.  ఎంగేజ్‌మెంట్ రోజు త‌న చేతివేలికి ఉంగ‌రం తొడుగుతున్న స్టిల్, గౌత‌మ్ కు థంబ్స్ అప్ చూపిస్తున్న ఫొటోను షేర్ చేసింది.

ఒక‌సారి వెడ్డింగ్ గ్రూప్ ఫొటోను చూపించాల‌ని ఓ అభిమాని అడుగ‌గా..గ్రూప్ స్టిల్ పోస్ట్ చేసింది కాజ‌ల్‌. గౌత‌మ్‌-కాజ‌ల్ క‌పుల్ ఒక‌రికొక‌రు కిస్ చేసుకుంటున్న స్టిల్‌తో 9 సంవ‌త్స‌రాల క్రితం ఓ పార్టీలో ఇద్ద‌రు హ‌మ్‌చేస్తున్న దృశ్యాన్ని అంద‌రితో పంచుకుంది. వెడ్డింగ్ తోపాటు ప‌లు వెకేష‌న్ల‌లో కాజ‌ల్ దిగి షేర్ చేసిన ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo