గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 29, 2020 , 21:11:28

బ్లాక్ డ్రెస్ లో మెరుస్తోన్న కాజ‌ల్‌..ఫొటోలు చ‌క్క‌ర్లు

బ్లాక్ డ్రెస్ లో మెరుస్తోన్న కాజ‌ల్‌..ఫొటోలు చ‌క్క‌ర్లు

క‌లువ క‌ళ్ల సుంద‌రి కాజ‌ల్ అగ‌ర్వాల్ మెగాస్టార్ చిరంజీవితో మ‌రోసారి క‌లిసి న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. కొరటాల శివ‌-చిరు కాంబినేష‌న్ లో వ‌స్తున్న ఆచార్య‌ సినిమా షూటింగ్ లో ఎప్ప‌డెప్పుడు జాయిన్ అవుతానా..అని ఎదురుచూస్తుంది కాజ‌ల్‌. లాక్ డౌన్ కాలంలో కొన్ని వెకేష‌న్ స్టిల్స్ షేర్ చేసిన ఈ బ్యూటీ తాజాగా మ‌రికొన్ని ఫొటోల‌తో అభిమానుల‌ను ప‌లుక‌రిస్తోంది. కాజ‌ల్ ఇంటి బాల్క‌నీలో నిల్చొని బ్లాక్ షార్ట్ వేర్ లో చేతిలో షాంపెయిన్ బాటిల్ ప‌ట్టుకుని కెమెరాకు పోజిచ్చిన ఫొటోలు ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. 

కాజ‌ల్ మ‌రోవైపు క‌మ‌ల్ హాస‌న్ తో ఇండియ‌న్ 2 చిత్రంలో న‌టిస్తోంది. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో నిలిచిపోయిన ఈ రెండు చిత్రాల షూటింగ్స్ త్వ‌ర‌లో షురూ అయ్యే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo