శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Oct 02, 2020 , 19:15:01

వంట‌చేస్తూ డ్యాన్స్ చేసిన హంసానందిని..వీడియో

వంట‌చేస్తూ డ్యాన్స్ చేసిన హంసానందిని..వీడియో

ఈగ‌, మిర్చి, అత్తారింటికి దారేది, లెజెండ్, బెంగాల్ టైగ‌ర్ చిత్రాల‌తో ప‌లు తెలుగు సినిమాల్లో మెరిసింది అందాల బ్యూటీ హంసానందిని. ఈ పూణే భామ స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్ల‌తో ట‌చ్ లో ఉంటుంది. తాజాగా హంసానందిని కిచెన్ లో డ్యాన్స్ చేసిన వీడియో ఇపుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. మా నాన‌మ్మ ద‌గ్గ‌ర వంట ప్రాముఖ్య‌తను, పోష‌క‌విలువ‌ల‌తో కూడి ఆహారాన్ని ఎలా చేసుకోవాలో నేర్చుకుంటూ పెరిగాను. ఈ కిచెన్ ప్రేమ‌తో నిండిపోయింది.  వంట చేయ‌డంలో ఉన్న ఎంజాయ్ మెంట్ వీడియోతో మీలో స్పూర్తిని క‌లిగిస్తుంద‌ని ఆశిస్తున్నాంటూ..నాన‌మ్మతో మ్యూజిక్ కు స్టెప్పులేస్తున్న వీడియో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

ఇంట్లో పెంచుకునే టారో ఆకుల‌తో ప్రాచుర్యం పొందిన మ‌రాఠీ వంట‌కం ఆలూచి వ‌డిని ఎలా చేయాలో కూడా చెప్పింది హంసానందిని. త‌న డ్యాన్స్, అందంతో అంద‌రినీ అల‌రించే ఈ బ్యూటీ ఈ సారి స‌రికొత్త‌గా కిచెన్ లో వంటను ఎంజాయ్ చేస్తూ స్టెప్పులేయడం అంద‌రినీ ఆకర్షిస్తోంది. వీలైతే హంసానందిని చెప్పిన వంట‌కాన్ని మీరు కూడా ట్రై చేసి చూడండి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.