'క‌ల‌ర్ ఫొటో'కు చాందిని ఫ‌స్ట్ చాయిస్ కాద‌ట‌..!

Oct 29, 2020 , 20:43:45

సుహాస్‌-చాందినీ చౌద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన చిత్రం క‌ల‌ర్‌ఫొటో. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో న‌లుపు రంగు ఛాయ ఉన్న అబ్బాయి, తెలుపు రంగు అమ్మాయి మ‌ధ్య జ‌రిగే ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాపీస్ వ‌ద్ద మంచి టాక్ తెచ్చుకుంది. సుహాస్‌-చాందినీ న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా చాందినీ చౌద‌రి ఫ‌స్ట్ చాయిస్ కాద‌ట‌. డైరెక్ట‌ర్ సందీప్ రాజ్ మొద‌ట హీరోయిన్ గా నిహారిక‌ను అనుకున్నాడ‌ట‌.

ఈ రోల్ కోసం మొద‌ట‌ నిహారిక‌ను సంప్ర‌దించాల‌ని అనుకోగా..సుహాస్ లీడ్ రోల్ అయ్యేస‌రికి ఆలోచ‌న‌లో ప‌డిన‌ట్టు టాక్‌. దీంతో ఆ త‌ర్వాత చాందినీ చౌద‌రిని హీరోయిన్ గా ఫైన‌ల్ చేశార‌ట సందీప్ రాజ్ అండ్ టీం. చాందినీ చౌద‌రి ఈ చిత్రంలో త‌న న‌ట‌న‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేసింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD