శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 26, 2020 , 19:22:03

రెండేళ్ల అగ్రిమెంట్‌..హిట్ సినిమాలు మిస్‌..!

రెండేళ్ల అగ్రిమెంట్‌..హిట్ సినిమాలు మిస్‌..!

చాందినీ చౌద‌రి..సినీ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి చాలా కాల‌మే అయింది. కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్ర‌ల్లో క‌నిపించింది. అయితే మంచి గుర్తింపు తెచ్చే పాత్ర ఒక్క‌టి రాలేదు. కానీ క‌ల‌ర్ ఫొటో సినిమా న‌టిగా చాందినీకి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది. ప్ర‌స్తుతం క‌ల‌ర్ ఫొటో స‌క్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న చాందినీ కెరీర్ లో ప‌డ్డ ఇబ్బందుల గురించి ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్ర‌ముఖ నిర్మాతతో చాందినీ ఓ అగ్రిమెంట్ కుదుర్చుకుంద‌ట‌. అదేంటంటే..రెండు సంవ‌త్సరాల వ‌ర‌కు మ‌రే చిత్రం చేయ‌కూడ‌ద‌ని కాంట్రాక్ట్ లో ఉంద‌ట‌.

ఈ రెండేళ్ల కాలంలో బ్లాక్ బ్లాస్ట‌ర్ హిట్ గా నిలిచిన ప‌టాస్, కుమారి 21 ఎఫ్ తోపాటు మరిన్ని హిట్ చిత్రాల్లో న‌టించే అవ‌కాశం కోల్పోయిన‌ట్టు చెప్పింది‌. మంచి అవ‌కాశాలు కోల్పోయి ఇబ్బందులు ప‌డ్డ కెరీర్ క‌ల‌ర్ ఫొటోతో మ‌ళ్లీ గాడిలో ప‌డిన‌ట్టు చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది చాందినీ చౌదరి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.