మంగళవారం 24 నవంబర్ 2020
Cinema - Oct 21, 2020 , 16:12:22

పుకార్ల‌కు పుల్‌స్టాప్ పెట్టిన భూమిక..!

పుకార్ల‌కు పుల్‌స్టాప్ పెట్టిన భూమిక..!

సినీ ప‌రిశ్ర‌మ‌లో పుకార్లు స‌ర్వ‌సాధార‌ణ‌మైన విషయ‌మే. న‌టీన‌టుల సినిమాల విష‌యాన్ని ప‌క్క‌న ప పెడితే..వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన చాలా పుకార్లు తెర‌పైకి వ‌స్తుంటాయి. సీనియ‌ర్ న‌టి భూమిక వైవాహ‌కి జీవితంపై కొన్ని రూమ‌ర్లు చ‌క్క‌ర్లు కొట్టాయి. 2007లో యోగా టీచ‌ర్ భ‌ర‌త్ ఠాకూర్ ను భూమిక పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే కొంత‌కాలంగా త‌న భ‌ర్త‌కు సంబంధించి సోష‌ల్ మీడియాలో  ఎలాంటి పోస్టులు పెట్ట‌క‌పోవ‌డంతో..భూమిక త‌న భ‌ర్త‌కు విడాకులిచ్చారా..? అంటూ వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే వీటిపై భూమిక మాత్రం స్పందించ‌లేదు.

ఇటీవ‌లే త‌మ వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ సంద‌ర్భంగా భ‌ర‌త్ ఠాకూర్ కు శుభాకాంక్ష‌లు చెప్పి..గాసిప్ రాయుళ్లకు త‌గిన బుద్ది చెప్పింది. భూమిక త‌న భ‌ర్త భ‌ర‌త్ ఠాకూర్ తో క‌లిసి త‌కిట త‌కిట అనే చిత్రాన్ని నిర్మించ‌గా..ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. దీంతో భ‌ర‌త్ ఠాకూర్ చిత్ర‌ప‌రిశ్ర‌కు దూరంగా ఉంటున్నాడు. మ‌రోవైపు నాని న‌టించిన ఎంసీఏ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టింది భూమిక. అంతేకాదు సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర‌స్ ఫొటోలు కూడా అప్పుడ‌పుడు పంచుకుంటుంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.