ఆదివారం 17 జనవరి 2021
Cinema - Dec 03, 2020 , 16:50:21

ఫ్లోర‌ల్ డిజైన్ డ్రెస్ లో అన‌సూయ..స్టిల్స్ చ‌క్క‌ర్లు

ఫ్లోర‌ల్ డిజైన్ డ్రెస్ లో అన‌సూయ..స్టిల్స్ చ‌క్క‌ర్లు

అన‌సూయ‌..చ‌క్క‌టి అందం, అభిన‌యంతో అంద‌రినీ ఆక‌ట్టుకోవ‌డం ఈ భామకు వెన్నెతో పెట్టిన విద్య‌. చ‌లాకీత‌నంతో మెస్మ‌రైజ్ చేసే ఓర‌చూపుతో టీవీ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూనే ఉంటుంది. మ‌రోవైపు సిల్వ‌ర్ స్క్రీన్ పై కూడా న‌ట‌న‌కు ఆస్కార‌మున్న ఛాలెంజింగ్ పాత్ర‌లు చేస్తూ న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా క‌నిపించే ఈ బ్యూటీ తాజాగా మ‌రో ఫొటోషూట్ తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఫ్లోర‌ల్ డిజైనుడ్ లెహెంగా వేసుకున్న అన‌సూయ న‌క్ష‌త్రాల‌తో రూపొందించిన డిజైన్ డ్ చెవిపోగులు పెట్టుకుంది.

అన‌సూయ ఫ్లోర‌ల్ కాస్ట్యూమ్స్ లో కెమెరాకు పోజులిస్తూ ధ‌గ‌ధ‌గ మెరిసిపోతుంది. తాజాగా దిగిన స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. అన‌సూయ ప్ర‌స్తుతం రంగ‌మార్తాండ‌, పుష్ప‌, ఆచార్య చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోంది. ఈ ప్రాజెక్టులు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.