శుక్రవారం 22 జనవరి 2021
Cinema - Jan 13, 2021 , 19:59:26

తెర‌‌పైకి అనుష్క పాత ప్రాజెక్టు..!

తెర‌‌పైకి అనుష్క పాత ప్రాజెక్టు..!

టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోల‌తో న‌టించి వ‌న్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ గా నిలిచింది అనుష్క‌. ఈ బ్యూటీ గ‌తేడాది న‌టించిన నిశ్శ‌బ్దం ఓటీటీలో విడుద‌లైంది. అయితే ఈ చిత్రం ఆశించిన విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. ఇక త‌ర్వాత ఏ సినిమా చేస్తున్న విష‌యంపై అనుష్క నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. తెలుగు, త‌మిళ భాషల్లో ప‌లు సినిమాల డిష్క‌ష‌న్స్ న‌డుస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తున్నా..వీటిపై అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న ఇవ్వ‌లేదు స్వీటీ.

ఇదిలా ఉంటే గ‌తంలో రా రా కృష్ణ‌య్య ఫేం డైరెక్ట‌ర్ పీ మహేశ్ తో అనుష్క ఓ సినిమా చేయనుంద‌ని చాలా సార్లు వార్త‌లు వ‌చ్చాయి. యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో నిర్మించ‌నున్నార‌ని టాక్ న‌డిచినా..ఆ త‌ర్వాత ఆ న్యూస్ కు బ్రేక్ ప‌డ్డ‌ది. మ‌ళ్లీ చాలా రోజుల త‌ర్వాత ఈ ప్రాజెక్టు మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. అనుష్క ఈ సినిమా గురించి పున‌రాలోచిస్తుంద‌ని తెలుస్తోండ‌గా..దీనిపై త‌దుప‌రి అప్‌డేట్ వ‌స్తే కానీ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం లేదు.

ఇవి కూడా చ‌ద‌వండి

మ‌తి పోగొడుతున్న మిల్కీ బ్యూటీ..ఫొటోలు వైర‌ల్

అన‌సూయకు సూప‌ర్‌స్టార్ తో న‌టించే ఛాన్స్ ..?

త్రివిక్ర‌మ్ తో నా సినిమా ప‌క్కా ఉంట‌ది: రామ్

‘టైమ్ ’చూసి దిగుతున్నారు

త్రివిక్ర‌మ్‌తో సినిమాపై రామ్ స్పంద‌న ఏంటి?

ఈ సంక్రాంతి సినిమాల స్పెషాలిటీ ఏంటంటే..?

12 కి.మీ సైకిల్ తొక్కిన‌ ర‌కుల్‌..ఎందుకంటే..?


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo