మంగళవారం 02 మార్చి 2021
Cinema - Jan 13, 2021 , 17:43:18

అన‌సూయకు సూప‌ర్ స్టార్ తో న‌టించే మ‌రో ఛాన్స్ ?

అన‌సూయకు సూప‌ర్ స్టార్ తో న‌టించే మ‌రో ఛాన్స్ ?

ఓ బుల్లితెర యాంకర్ కు ఇంత పాపులారిటీ రావడం చాలా అరుదుగా జరిగే విషయం. కానీ అనసూయ దాన్ని సంపాదించి చూపించింది. పైగా ఈమెకు పెళ్లి కూడా అయిపోయింది. సాధారణంగా పెళ్లైతే కెరీర్ అయిపోతుందంటారు కానీ పెళ్లి తర్వాతే తన కెరీర్ మొదలు పెట్టి సంచలనం సృష్టిస్తుంది అనసూయ. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈమె ఇమేజ్ హద్దులు దాటేస్తుంది.. రాష్ట్రాలు కూడా దాటిపోతుంది. ఇప్పటి వరకు తెలుగులో మాత్రమే సత్తా చూపించిన అనసూయ ఇప్పుడు తమిళ, మలయాళ ఇండస్ట్రీలకు కూడా వెళ్తుంది. పైగా ఈమె హాట్ సో చూసిన తర్వాత హీరోయిన్లు కూడా కుళ్లుకోకుండా ఉండలేకపోతున్నారు. అంతందాన్ని కెమెరా ముందు పెట్టి నిద్ర చెడగొడుతుంది అనసూయ. పెళ్లై తల్లైన తర్వాత కూడా ఇప్పటికీ నాకేం తక్కువ అంటుంది అనసూయ. ఒక్కోసారి పద్దతిగా కనిపిస్తుంది.. మరోసారి మాత్రం హాలీవుడ్ హీరోయిన్ రేంజ్‌లో రెచ్చిపోతుంది. 

నిజం చెప్పాలంటే అనసూయగా ఉన్నపుడు ఈమెను ఎవరూ పట్టించుకోలేదు.. పేరు చివర భరద్వాజ్ వచ్చి చేరిన తర్వాతే అనసూయ కెరీర్ ఇంకా మెరుగుపడింది. ఇంకా చెప్పాలంటే స్టార్ అయింది. ఎక్కడైనా అమ్మాయి వచ్చిన వేళా విశేషం అంటారు.. కానీ అనసూయకు మాత్రం భరద్వాజ్ వచ్చిన వేళా విశేషం అనాలేమో..? ఎందుకంటే 2013 నుంచి ఇప్పటి వరకు స్టార్ యాంకర్ గా కొనసాగుతూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు తన అందంతో మాయ చేస్తూనే ఉంది. అసలు అనసూయను చూస్తుంటే హీరోయిన్ లకు కూడా కుళ్లు తప్పదేమో..? అంతగా మాయ చేస్తుంది ఈ బ్యూటీ. ఈమె సోకుల వలలో చిక్కుకుని కుర్ర హృదయాలు నిద్ర లేకుండా తపించిపోతున్నాయి. అంతగా చూపుల బాణాలతో గుచ్చేసింది అనసూయ. 

ఇద్దరు పిల్లల తల్లైన తర్వాత కూడా ఈ స్థాయిలో ఫిజిక్ కాపాడుకుంటున్న అనసూయను చూసి అసూయ పడుతున్నారు అమ్మాయిలు. మరోవైపు సినిమాల్లో కూడా దూసుకుపోతుంది అనసూయ. తెలుగులో ఎప్పటికప్పుడు వరస సినిమాలు చేస్తూనే ఉంటుంది అనసూయ. ఈ మధ్యే తమిళ ఇండస్ట్రీకి కూడా వెళ్లాలని ఉందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈమెకు మాలయాళం నుంచి అవకాశం వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్న సినిమాలో ఓ కీలక పాత్ర కోసం అనసూయను సంప్రదించారని తెలుస్తుంది. కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పింది ఈ స్టార్ యాంకర్. గతంలోనే మమ్ముట్టితో కలిసి యాత్ర సినిమాలో నటించింది అనసూయ. ఇప్పుడు మరో సినిమా కూడా చేయబోతుందని ప్రచారం జరుగుతుంది. మరి మలయాళంలో మన అనసూయ ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందో చూడాలి.

ఇవి కూడా చ‌ద‌వండి

ముక్కాల ముక్కాబుల సాంగ్‌కు పిల్ల‌ల‌తో అన‌సూయ డ్యాన్స్

నాలో క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించాయి.. అన‌సూయ ట్వీట్‌

ఈ సంక్రాంతి సినిమాల స్పెషాలిటీ ఏంటంటే..?


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo