శనివారం 23 జనవరి 2021
Cinema - Dec 03, 2020 , 14:25:30

గోవాలో ర‌వితేజ-శృతిహాస‌న్

గోవాలో ర‌వితేజ-శృతిహాస‌న్

టాలీవుడ్ యాక్ల‌ర్లు ర‌వితేజ‌-శృతిహాస‌న్ కాంబినేష‌న్ లో వ‌స్తోన్న చిత్రం క్రాక్‌. గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాలో వచ్చే ఓ పాట‌ను గోవాలో చిత్రీక‌రిస్తున్నారు. ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ డైరెక్ష‌న్ లో కంపోజ్ చేసిన ల‌వ్ లీ పాట‌ను ర‌వితేజ-శృతిహాస‌న్ ల‌పై షూట్ చేయ‌నున్నారు. ఈ సాంగ్ షూట్ కోసం ఇప్ప‌టికే ర‌వితేజ అండ్ టీం గోవాలోని బీచ్ కు చేరుకున్న‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. కొరియోగ్రాఫ‌ర్ రాజుసుంద‌రం ఈ పాట‌కు నృత్య‌రీతులు స‌మ‌కూరుస్తున్నారు. రేప‌టి నుంచే ఈ పాట‌ను షూట్ చేయ‌డం మొద‌లు పెట్ట‌నున్నారట‌.

మ‌రోవైపు ఇటీవ‌లే ఈ చిత్రంలోని భూమ్ బ‌ద్ద‌ల్ అంటూ సాగే మాస్ సాంగ్ ర‌వితేజ-అప్స‌రా రాణిపై షూట్ చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo