బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Sep 15, 2020 , 18:58:30

న‌గ‌రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక‌

న‌గ‌రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక‌

హైదరాబాద్‌: విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా..గీత‌గోవిందం సినిమాతో బాక్సాపీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది ఈ జంట‌. ఆ త‌ర్వాత ఈ ఇద్ద‌రు స్టార్లు మ‌రోసారి డియ‌ర్ కామ్రేడ్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు స్టార్లు త‌మ త‌మ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ, పూరీ జ‌గ‌న్నాథ్ తో ఫైట‌ర్ సినిమా చేస్తుండ‌గా..ర‌ష్మిక‌నేమో సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న పుష్ప‌లో న‌టిస్తోంది. ఈ రెండు చిత్రాల షూటింగ్స్ రీస్టార్ట్ అవ్వ‌డానికి కొంత టైం ప‌ట్టే అవ‌కాశ‌ముంది. దీంతో విజ‌య్ దేవ‌ర‌కొండ హైద‌రాబాద్ లోని ఓ జిమ్ సెంట‌ర్ వ‌ద్ద జిమ్ వేర్ లుక్ లో ఫేస్‌మాస్క్ తో క‌నిపించాడు.గ్రే ఫుల్ స్టీవ్స్ టీ విత్ బ్లాక్ షార్ట్స్ కాంబోలో చేతిలో ఫోన్ ప‌ట్టుకుని క‌నిపించాడు.

మ‌రోవైపు ర‌ష్మిక మంద‌న్నా ఇటీవ‌లే కొన్ని నెల‌ల విరామం త‌ర్వాత‌ స్వ‌స్థ‌లం నుంచి హైద‌రాబాద్ కు తిరిగొచ్చింది. క్యాజువ‌ల్ ఆఫ్ డ్యూటీ లుక్ లో క‌నిపిస్తూ సంద‌డి చేసింది. ఈ ఇద్ద‌రు యువ స్టార్లు హైద‌రాబాద్ లో ప్ర‌త్య‌క్ష‌మైన ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.