శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Oct 07, 2020 , 16:26:43

తెర‌పైకి ప‌వ‌న్-రానా కాంబినేష‌న్

తెర‌పైకి ప‌వ‌న్-రానా కాంబినేష‌న్

టాలీవుడ్ లో మ‌ల్టీస్టారర్ చిత్రాలు కొత్తేమీ కాదు. అయితే తాజాగా అరుదైన కాంబినేష‌న్ తెర‌పై సంద‌డి చేయ‌నున్న‌ట్టు వార్త ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇంత‌కీ ఆ ఇద్ద‌రు స్టార్లు ఎవ‌ర‌నే క‌దా మీ డౌటు. వారే ప‌వ‌న్ కళ్యాణ్‌, రానా. మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ చిత్రంగా నిలిచిన అయ్య‌ప్ప‌న్నుమ్ కొషియుమ్ ప్రాజెక్టును తెలుగులో రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-రానా హీరోలుగా న‌టించ‌నున్నార‌ని టాక్ న‌డుస్తోంది. ప‌వ‌న్ కళ్యాణ్ ప్ర‌స్తుతం న‌టిస్తోన్న వ‌కీల్ సాబ్ షూటింగ్ ఈ నెలలో పూర్తికానుంది.

క్రిష్ తో ప‌వ‌న్ చేయ‌నున్న సినిమాకు మ‌రికొంత స‌మ‌యం ప‌ట్ట‌నుండ‌టంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు డిసెంబ‌ర్ నుంచి మార్చి వ‌ర‌కు టైం దొర‌కనుంది. ఈ పీరియ‌డ్‌లో రానాతో క‌లిసి మ‌ల్టీస్టారర్ ను చేయాల‌ని ప‌వ‌న్ అనుకుంటున్నాడ‌ట‌. ప‌వ‌న్ ఈ సినిమా చేసే అవ‌కాశ‌ముండ‌టంతో రానా కూడా ఈ ప్రాజెక్టు చేయాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ప‌వ‌న్‌-రానా కాంబినేష‌న్ పై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నేది కూడా తెలియాల్సి ఉంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.