శనివారం 16 జనవరి 2021
Cinema - Dec 02, 2020 , 18:40:14

టాలీవుడ్ న‌టుడు యాదాకృష్ణ క‌న్నుమూత‌

టాలీవుడ్ న‌టుడు యాదాకృష్ణ క‌న్నుమూత‌

టాలీవుడ్ న‌టుడు, నిర్మాత (61) యాదాకృష్ణ క‌న్నుమూశారు. హైద‌రాబాద్ లో ఇవాళ ఉద‌యం  యాదాకృష్ణ‌కు గుండెపోటు రావ‌డంతో తుదిశ్వాస విడిచారు. ఆయ‌న‌ 20కి పైగా తెలుగు సినిమాల్లో న‌టించారు. ప‌లు సినిమాల‌కు నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించారు. 2010లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంక్రాంతి అల్లుడు సినిమాలో చివ‌రిసారిగా న‌టించారు. కొంత‌కాలంగా యాదాకృష్ణ సినిమాల‌కు దూరంగా ఉంటున్నారు. యాదాకృష్ణ మృతి ప‌ట్ల ప‌లువురు సినీ, రాజకీయ ప్ర‌ముఖులు తీవ్రదిగ్బ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. గుప్త శాస్త్రం, వ‌య‌స్సు కోరిక, పిక్నిక్ వంటి బీ గ్రేడ్ సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్నారు యాదాకృష్ణ.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.