గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 24, 2020 , 15:06:46

బ‌న్సాలీతో విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా..!

బ‌న్సాలీతో విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా..!

విజ‌య్ దేవ‌ర‌కొండ తొలిసారి పాన్ ఇండియా సినిమా ఫైట‌ర్ లో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. పూరీ జ‌గ‌న్నాత్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను హిందీలో ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కనిర్మాత క‌ర‌ణ్ జోహార్ సమ‌ర్పిస్తున్నారు. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో నిలిచిపోయిన షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి ఉండ‌గానే విజ‌య్ దేవ‌ర‌కొండ డైరెక్ట్ బాలీవుడ్ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు ఇపుడు చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కనిర్మాత సంజ‌య్ లీలా బ‌న్సాలీతో విజ‌య్ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు బీటౌన్ లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

2019లో బాలాకోట్ వైమానిక దాడులు (ఎయిర్ స్టై్క్స్) ఆధారంగా రానున్న ఈ చిత్రంలో ఐఎఏఫ్ వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్ద‌మాన్ పాత్ర‌లో విజ‌య్ క‌నిపించ‌నున్నాడ‌ట‌. కై పో చే, కేదార్ నాథ్ వంటి చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించిన అభిషేక్ క‌పూర్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo