టాలీవుడ్ యాక్టర్ విక్టరీ వెంకటేశ్ లీడ్ రోల్ లో నటిస్తోన్న చిత్రం నారప్ప. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో వస్తోన్న నారప్ప ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. వెంకీ మార్క్ యాక్షన్ అండ్ ఎమోషన్ సీన్లు ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. వెంకటేశ్ పెద్ద వయస్కుడిగా, యువకుడిగా రెండు పాత్రల్లో జీవించేసినట్టు తాజా రషెస్ చూస్తే అర్థమవుతుంది. చాలా రోజుల తర్వాత వెంకీ తనలోని మాస్ యాంగిల్ ను నారప్ప చిత్రం ద్వారా అభిమానులకు చూపించబోతున్నాడు.
‘మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బుంటే లాగేసుకుంటారు. కానీ చదువునొక్కటి మాత్రం మన దగ్గర నుంచి ఎవరూ తీసుకోలేరు చిన్నప్ప’ అంటూ వెంకటేశ్ తన కొడుకుకు చెప్పడం ట్రైలర్ లో చూడొచ్చు. శ్యామ్ కే నాయుడు కెమెరా వర్క్ అద్బుతంగా ఉంది. ట్రైలర్ లో వచ్చే విజువల్స్ మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో హై పిచ్ కు వెళ్లాయి. సురేశ్ ప్రొడక్షన్స్ అండ్ వీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు హై స్టాండర్డ్ లో కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రియమణి, కార్తీక్ రత్నం, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నారప్ప మరో 6 రోజుల్లో అంటే జులై 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి..
గోవా బీచ్లో కిమ్ శర్మతో టెన్నిస్ స్టార్.. ఫోటోలు వైరల్
రామ్ మూవీ షూట్లో ప్రముఖ నటి
వెయిట్ లిఫ్టర్ లా సారా అలీఖాన్..వీడియో హల్చల్
నారప్ప, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!