శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Sep 08, 2020 , 18:34:43

నార‌ప్ప షూటింగ్ కు వెంకీ గ్రీన్ సిగ్న‌ల్..!

నార‌ప్ప షూటింగ్ కు వెంకీ గ్రీన్ సిగ్న‌ల్..!

టాలీవుడ్ యాక్ట‌ర్ వెంక‌టేశ్ ప్ర‌స్తుతం నార‌ప్ప సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. త‌మిళంలో బ్లాక్ బాస్ట‌ర్ హిట్ గా నిలిచిన అసుర‌న్ ను  శ్రీకాంత్ అడ్డాల తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. క‌థానుగుణంగా ఈ సినిమాను త‌మిళ‌నాడులోని లొకేష‌న్ల‌లో సుమారు 60 శాతం షూటింగ్ పూర్తి చేశారు. అయితే లాక్ డౌన్ కార‌ణంగా షూటింగ్ వాయిదా ప‌డ్డ‌ది. కోవిడ్‌-19 ప‌రిస్థితుల నేప‌థ్యంలో వాయిదా ప‌డ్డ షూటింగ్ మ‌ళ్లీ షురూ కానుంది. వెంక‌టేశ్ షూటింగ్ రీస్టార్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ లో లేటెస్ట్ టాక్.

తాజా స‌మాచారం ప్ర‌కారం నార‌ప్ప షూటింగ్ అక్టోబ‌ర్ చివ‌రి వారంలో మొద‌లు కానుంద‌ట‌. ఇప్ప‌టికే ఈ చిత్రంలో వెంకీకి సంబంధించిన మేజ‌ర్ పార్టు షూటింగ్ పూర్త‌యింది. ఈ మూవీలో నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ ప్రియ‌మ‌ణి హీరోయిన్ గా న‌టిస్తోంది. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.