శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Oct 08, 2020 , 21:26:03

మేక్ ఇండియా సేఫ్..వెంకీ మూడు టిప్స్..వీడియో

మేక్ ఇండియా సేఫ్..వెంకీ మూడు టిప్స్..వీడియో

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారిని నిర్మూలించడంలో ప్ర‌జ‌ల‌కు మ‌రింత అవ‌గాహ‌న  క‌ల్పించేందుకు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోదీ జ‌‌న్ ఆందోళ‌న్ కార్య‌క్ర‌మాన్ని నేడు ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌తీ ఒక్క‌రూ ఈ విష‌యాల‌ను గుర్తు పెట్టుకోవాల‌ని ప్ర‌ధాని విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌తీ ఒక్క‌రూ మాస్కు ధ‌రించాలి. భౌతిక దూరాన్ని పాటిస్తూ..నిరంతరం చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండండి. క‌నీసం వ్య‌క్తుల మ‌ధ్య  2 గంజాల దూరం పాటించాల‌ని మోదీ సూచ‌న‌లు చేశారు. 

ప్ర‌ధాని మోదీ పిలుపు మేర‌కు టాలీవుడ్ న‌టుడు వెంక‌టేశ్ ప్ర‌జ‌ల‌కు త‌న సందేశాన్ని తెలిపాడు. ఇండియాను సుర‌క్షితంగా ఉంచ‌డానికి నా మూడు మంత్రాలు..మాస్కు ధ‌రించ‌డం, చేతులు శుభ్రంగా క‌డుక్కోవ‌డం, సామాజిక దూరాన్ని పాటిద్దాం. పీఎం జ‌న్ ఆందోళ‌న్ లో పాల్గొందాం. క‌రోనాను త‌రిమి కొట్టేందుకు యుద్ధం చేద్దామ‌ని వెంక‌టేశ్ పిలుపునిచ్చారు. మ‌రోవైపు టాలీవుడ్ యాక్ట‌ర్లు అక్కినేని నాగార్జున, మ‌హేశ్ బాబు కూడా జ‌న్ ఆందోళ‌న్ పాల్గొందామ‌ని త‌న ట్వీట్ ద్వారా పిలుపునిచ్చారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo