శుక్రవారం 07 ఆగస్టు 2020
Cinema - Jul 11, 2020 , 16:46:08

‘ఫోకస్‌’ అంటూ వరుణ్‌తేజ్‌ కొత్త ఇన్‌స్టా పోస్ట్‌

‘ఫోకస్‌’ అంటూ వరుణ్‌తేజ్‌ కొత్త ఇన్‌స్టా పోస్ట్‌

ముకుందా చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమై..ఫిదా, కంచె, వాల్మీకి చిత్రాలతో తన కంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్‌తేజ్‌. ఈ యువ నటుడు తాజాగా బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కతున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బాక్సర్‌గా కనిపించనున్న వరుణ్‌ తేజ్‌ మేకోవర్‌ ను మార్చుకునేందుకు చాలా కష్టపడుతున్నట్టుగా సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న ఫొటోలు చెప్తున్నాయి.

తాజాగా వరుణ్‌తేజ్‌ ఫోకస్‌ క్యాప్షన్‌తో జిమ్‌ రూంలో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ కలర్‌ ఫొటోలో డార్క్‌నైట్‌లో సీరియస్‌ లుక్‌లో కనిపిస్తున్న వరుణ్‌ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కిరణ్‌ కొర్రపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు తారాగణం, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo