ustad ram pothineni | హీరో రామ్ మొన్నటి వరకు ఎనర్జిటిక్ స్టార్.. కానీ ఇప్పుడు ఉస్తాద్ అయిపోయాడు. రెండేళ్ల కింద పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తన ఇమేజ్ పూర్తిగా మార్చుకున్నాడు రామ్ పోతినేని. అప్పటి వరకు ఈయనకు కాస్తో కూస్తో ఉన్న క్లాస్ ఇమేజ్ పూర్తిగా పోయింది. అప్పటి నుంచి పవర్ఫుల్ మాస్ హీరో అయిపోయాడు రామ్. ఆ తర్వాత నటించిన రెడ్ సినిమాలో కూడా రామ్ పేరు ముందు ఉస్తాద్ అని పడింది. దాంతో అభిమానులు కూడా అప్పటి నుంచి ఉస్తాద్ రామ్ పోతినేని అని పిలుస్తున్నారు.
ఇప్పుడు తన టైటిల్‌కి తగ్గట్లు మారిపోయాడు. ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రామ్ పోతినేని. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది ఈ సినిమా. ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ఇందులో రామ్‌కు జోడీగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. సగానికి పైగా పూర్తయింది. ఈ సినిమా కోసం రామ్ పోతినేని చాలానే కష్టపడుతున్నాడు. కసరత్తులు చేస్తూ తనను తాను మార్చుకుంటున్నాడు. ఈ క్రమంలోనే జిమ్‌లో ఉన్న ఒక ఫొటో తాజాగా బయటకొచ్చింది. ఈ ఫొటో చూసిన తర్వాత అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఇందులో సరికొత్త రామ్ అభిమానులకు కనిపిస్తున్నాడు.
తాజాగా బయటకొచ్చిన ఫొటోల్లో కండలు పెంచి సరికొత్తగా కనిపిస్తున్నాడు రామ్ పోతినేని. ఈయనను చూసి వామ్మో ఏంటి ఇలా అయిపోయాడు అంటూ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. రాబోయే సినిమాలో కూడా ఇదే విధంగా కనిపించబోతున్నాడు రామ్ పోతినేని. అంతేకాదు ఇప్పటి నుంచి ఎంచుకునే కథల విషయంలోనూ పూర్తి క్లారిటీగా ఉన్నాడు. ఎక్కువగా మాస్ అప్పీల్ ఉన్న కథల వైపు అడుగులు వేస్తున్నాడు రామ్ పోతినేని.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Krishnam Raju: కృష్ణం రాజుకి ప్రమాదం.. అపోలోలో చికిత్స..!
Mallika Sherawat | తండ్రి పేరు చెప్పని మల్లికాశెరావత్..కారణమిదే..!
Naga Chaitanya: సమంతకి థ్యాంక్స్ చెప్పిన చైతూ.. ఇప్పటికైన పుకార్లకి ఫుల్స్టాప్ పడ్డట్టేనా?