గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 20, 2020 , 19:14:29

షూటింగ్ కు రెడీ అయిన సుశాంత్‌

షూటింగ్ కు రెడీ అయిన సుశాంత్‌

ఈ ఏడాది అల వైకుంఠపురంలో..చిత్రంలో స్పెష‌ల్ రోల్ లో క‌నిపించి సంద‌డి చేశాడు టాలీవుడ్ న‌టుడు సుశాంత్‌. ఈ యాక్ట‌ర్ ప్ర‌స్తుతం 'ఇచట వాహ‌నములు నిలుప‌రాదు' అనే టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలోనే సినిమా షూటింగ్ మొద‌ల‌వ్వ‌గా..కోవిడ్ ప్ర‌భావంతో షూట్ నిలిచిపోయింది. సుమారు 6 నెలల విరామం త‌ర్వాత సుశాంత్ అండ్ టీం చిత్రీక‌ర‌ణ‌కు సిద్ద‌మ‌వుతోంది. మీనాక్షి చౌద‌రి ఈ మూవీలో హీరోయిన్ గా న‌టిస్తోంది.

వెన్నెల కిశోర్‌, ప్రియ‌ద‌ర్శి ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ద‌ర్శ‌న్ ఈ ప్రాజెక్టును డైరెక్ట్ చేస్తుండ‌గా...ర‌విశంక‌ర్ శాస్త్రి, హ‌రీష్ కోయ‌ల‌గుండ్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుశాంత్ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డించనుంది చిత్ర‌యూనిట్‌. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.