ఆదివారం 17 జనవరి 2021
Cinema - Nov 26, 2020 , 20:26:11

క్రేజీ అప్ డేట్‌..పుష్ప‌లో సునీల్‌..?

క్రేజీ అప్ డేట్‌..పుష్ప‌లో సునీల్‌..?

తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఎక్జ‌యిటింగ్ గా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు పుష్ప‌. టాలీవుడ్ డైరెక్ట‌ర్ సుకుమార్‌-అల్లు అర్జున్ కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి వ‌స్తున్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ మూవీలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయ‌న్ గా న‌టిస్తోంది. అయితే ప్రాజెక్టు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి విల‌న్ ఎవ‌ర‌నే దానిపై చ‌ర్చ కొన‌సాగుతూనే ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి పేరు వినిపించ‌గా..ఆ త‌ర్వాత బాబీ సింహా పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఇపుడు మ‌రో యాక్ట‌ర్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.

క‌మెడియ‌న్‌గా అంద‌రినీ క‌డుపుబ్బా న‌వ్వించి, హీరోగా ప‌లు సినిమాల్లో న‌టించి, ఇటీవ‌లే క‌ల‌ర్ ఫొటోలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టించిన సునీల్ ఈ చిత్రంలో విల‌న్ గా క‌నిపించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే మెయిన్ విల‌న్ గా కాకుండా నెగెటివ్ షేడ్స్ ఉన్న మ‌రో రోల్‌లో క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం న‌డుస్తోంది. మ‌రి సుకుమార్ ఎవ‌రిని మెయిన్ విల‌న్ గా సెలెక్ట్ చేస్తాడో..?  సునీల్ ను ఎలా చూపిస్తాడో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.