బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Oct 16, 2020 , 20:58:56

సునీల్ ఫ్రీగా న‌టిస్తాన‌న్నాడ‌ట‌..!

సునీల్ ఫ్రీగా న‌టిస్తాన‌న్నాడ‌ట‌..!

చాందినీ చౌద‌రి, సుహాస్ కాంబినేష‌న్ లో వ‌స్తోన్న మూవీ క‌ల‌ర్ ఫొటో. సాయి రాజేశ్ క‌థనందించ‌గా..సందీప్ రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తెలుపు రంగు అమ్మాయి, న‌లుపు రంగు ఛాయ ఉన్న అబ్బాయి మ‌ధ్య సాగే ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో సాగనుంది. ఈ చిత్రంలో యాక్ట‌ర్ సునీల్ పోలీసాఫీస‌ర్ గా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టించాడు. న‌వంబ‌ర్ 14న ఆహా ప్లాట్ ఫాంలో చిత్రం విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో సునీల్ ఫ్రీగా న‌టిస్తాన‌న్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో సాయిరాజేశ్ చెప్పాడు.

సునీల్ నా క‌థ‌కు చాలా ఇంప్రెస్ అయ్యారు. క‌థ బాగా న‌చ్చ‌డంతో సునీల్ ఈ చిత్రంలో ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ఉచితంగా న‌టిస్తాన‌ని అన్నారు. అయితే సినిమా షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత సునీల్ కు రెమ్యున‌రేష‌న్ ఇచ్చామ‌ని చెప్పాడు. సునీల్ ఈ సినిమాలో హీరోయిన్ సోద‌రుడిగా పోలీసాఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తాడు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo