టాలీవుడ్ లో రాబోతున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి ఎఫ్3. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేశ్, వరుణ్ తేజ్ కాంబినేషన్ మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతుంది. అయితే ఈ సారి సునీల్ కూడా తన యాక్టింగ్ తో అలరించబోతున్నాడు. తాజాగా సునీల్ పాత్రకు సంబంధించిన అప్ డేట్ ఒకటి తెరపైకి వచ్చింది. ఎఫ్ 3లో సునీల్ అప్పులు ఇచ్చే వ్యక్తిగా కనిపించనున్నాడట. భారీగా డబ్బున్నా ఖర్చుపెట్టడానికి మాత్రం వెనుకాడే వ్యక్తిగా సునీల్ నటించనున్నట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్.
తాజా టాక్ ప్రకారం వెంకటేశ్, వరుణ్ తేజ్ కు సునీల్ రుణం ఇస్తాడు. ఆ తర్వాత వారిద్దరు ఎలాంటి చిక్కుల్లో పడతారు. వారి సమస్యలను ఎలా పరిష్కరించుకుంటారనేది సిల్వర్ స్క్రీన్ పై చూపించబోతున్నారని ఇన్ సైడ్ టాక్. తమన్నా భాటియా, మెహరీన్ కౌర్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. కాగా దిల్రాజు నిర్మిస్తున్నారు.