శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Aug 24, 2020 , 21:39:38

ట్రాఫిక్ పోలీస్ గా సుమంత్..మోష‌న్ పోస్ట‌ర్

ట్రాఫిక్ పోలీస్ గా సుమంత్..మోష‌న్ పోస్ట‌ర్

టాలీవుడ్ యాక్ట‌ర్ సుమంత్ మాస్ ఇమేజ్ ఉన్న సినిమాలు అంత‌గా క‌లిసిరాలేద‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. దీంతో ల‌వ్ బ్యాక్ డ్రాప్ తోపాటు స‌రికొత్త క‌థాంశాల‌తో కూడిన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రిస్తున్నాడు. తాజాగా సుమంత్ క‌ప‌ట‌దారి అనే మూవీ చేస్తున్నాడు. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్ ను హీరో నాగ‌చైత‌న్య విడుద‌ల చేశాడు. సుమంత్ ట్రాఫిక్ పోలీసాఫీస‌ర్ గా గ‌తంలో ఎన్న‌డూ లేన‌ట్టు స‌రికొత్త లుక్ లో క‌నిపిస్తున్నాడు. మ‌రోవైపు ఆర్టిక‌ల్ 352ను మోష‌న్ పోస్ట‌ర్ లో చూడొచ్చు.

ఎమ‌‌ర్జెన్సీ స‌మ‌యంలో ఆర్టిక‌ల్ 352 నేప‌థ్యంలో ఈ సినిమా సాగుతుంద‌ని ఫ‌స్ట్ లుక్ ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో నందితా శ్వేత హీరోయిన్ గా న‌టిస్తోంది. వెన్నెల కిశోర్, నాజ‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.