శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 09, 2020 , 18:00:29

ప్ర‌తీ సినిమా విడుద‌లకు మొక్క‌లు నాటుతా: సుధీర్ బాబు

ప్ర‌తీ సినిమా విడుద‌లకు మొక్క‌లు నాటుతా: సుధీర్ బాబు

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో మందిలో స్పూర్తి నింపి కొత్త ఆలోచనలకు తెరలేపుతుంది. హీరో నవీన్ కృష్ణ ఇచ్చిన ఛాలెంజ్ ను టాలీవుడ్ న‌టుడు సుధీర్ బాబు స్వీక‌రించారు. ఇవాళ సుధీర్ బాబు గండిపేటలోని తన నివాసంలో మొక్కలు నాటారు. అనంత‌రం సెల్ఫీ దిగారు. 

ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ..  రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మాలో కొత్త ఆలోచనలు తీసుకువస్తుంది. ఈ ఛాలెంజ్ స్వీకరించి ఈ రోజు తన నివాసంలో మొక్కలు నాటడం జరిగింది.  ఈ నాటిన మొక్కకు ప్రత్యేకత ఉందని..ఇటీవ‌లే విడుదల అయిన వీ సినిమా కు గుర్తుగా మొక్కలు నాటడం జరిగింది అని తెలిపారు. ఇకపై నేను ఏ మంచి కార్యక్రమం చేపట్టిన నా నూతన సినిమాల విడుదలకు ముందు మొక్కను నాటి ఆ మొక్కకు ఆ సినిమా పేరు పెట్టుకుంటాను అని చెప్పారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఏదైనా  మంచి కార్యక్రమం చేపడుతున్నపుడు దాని ముందు మొక్కలను నాటి వాటికి పేర్లు పెట్టుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుందని. భవిష్యత్తులో కూడా మా పిల్లలకు కూడా నేను ఇదే నేర్పిస్తానన్నారు.

పిల్ల‌లు ఎగ్జామ్ లో మంచి మార్కులు తెచ్చుకున్నపుడు, వారు ఉద్యోగం సాధించినప్పుడు మొక్కలు నాటే అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కు మా V సినిమా చిత్ర బృందం  తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సుధీర్ బాబు పేర్కొన్నారు. ఇదే విధంగా ఈ చాలెంజ్  ముందుకు కొనసాగాలని కోరారు. మా V సినిమా చిత్ర యూనిట్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ,హీరోయిన్లు నివేదా థామస్, అదితి రావు లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.


సుధీర్ బాబుకు ధ‌న్య‌వాదాలు: ఎంపీ సంతోష్ కుమార్

తన ప్రతి సినిమా విడుదల సందర్భంగా మొక్క నాటి.. దానికి ఆ సినిమా పేరు పెట్టుకోవాలని హీరో సుధీర్ బాబు నిర్ణయం తీసుకోవ‌డం ప‌ట్ల రాజ్య‌స‌భ‌ సభ్యులు సంతోష్ కుమార్ అభినందనలు తెలియజేశారు. ఇలాంటి మొక్కలు నాటాలని చైతన్యం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని. ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యత తీసుకొని ఏ మంచి సందర్భం వచ్చినప్పుడు అయినా మొక్కలు నాటడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.







logo