గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 02, 2020 , 15:21:00

సోనూసూద్‌కు తొలి సినిమా ఛాన్స్ అలా వ‌చ్చింద‌ట‌ !

సోనూసూద్‌కు తొలి సినిమా ఛాన్స్ అలా వ‌చ్చింద‌ట‌ !

సోనూసూద్ తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళ భాషల్లో అంద‌రికీ సుప‌రిచితుడైన న‌టుడు. లాక్ డౌన్ కాలంలో విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న వేలాది మందికి నేనున్నానంటూ అండ‌గా నిలిచి..రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు. ఎంతోమందికి స్పూర్తిగా నిలిచాడు. చిన్న పాత్ర‌తో కెరీర్ ను షురూ చేసి భారీ బ‌డ్జెట్ చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టించే స్థాయికి ఎదిగాడు.

సోనూసూద్ త‌న తొలి సినిమా గురించి నేహా దూపియా నో ఫిల్ట‌ర్ విత్ నేహా..చిట్ చాట్ లో మాట్లాడుతూ..సౌతిండియాలో మొద‌టి సినిమా అవ‌కాశం పొందిన‌పుడు మా అమ్మ నాకు త‌మిళ్ ఎలా నేర్చుకోవాలి అనే పుస్త‌కాన్ని కానుక‌గా ఇచ్చింది. కొన్ని కొన్ని ప‌దాల‌తో త‌మిళం నేర్చుకున్నా. నేను స్డూడియోకు వెళ్లాను. ఒంటరిగా కూర్చోమ‌ని అసిస్టెంట్ డైరెక్ట‌ర్ నాకు చెప్పాడు. నా జీవితం మార‌నుంద‌ని ఊహించుకోవ‌డం ప్రారంభించాను. ఆ త‌ర్వాత డైరెక్ట‌ర్, నిర్మాత నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి వెల్ డ‌న్ సోనూ నీకు మంచి దేహ‌దారుఢ్యం ఉంది.

ఒక్క‌సారి టీ షర్ట్ తీసి నీ బాడీ చూపిస్తావా..? అని అడిగారు. త‌ప్ప‌కుండా అని టీ ష‌ర్ట్ విప్పేశాను. సోనూ సూద్ నీవు మా సినిమా చేస్తున్నావు అన్నా రు. అది చెన్నైలో విప‌రీతంగా వ‌ర్షం ప‌డుతున్న స‌మ‌యం. ఆ క్ష‌ణాలను  ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేన‌ని చెప్పుకొచ్చాడు సోనూసూద్‌. 1999లో వ‌చ్చిన ఖ‌ల్లంజాగ‌ర్ చిత్రంతో త‌మిళ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోకి అడుగ‌పెట్టాడు సోనూసూద్‌. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo