శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 30, 2020 , 16:31:37

షూట్ లో జాయిన్ అయిన సంపూర్ణేశ్ బాబు

షూట్ లో జాయిన్ అయిన సంపూర్ణేశ్ బాబు

చిన్న పాత్ర‌ల‌తో కెరీర్ ప్రారంభించి..హృద‌య కాలేయం చిత్రంతో హీరోగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సంపూర్ణేశ్ బాబు. ఆ త‌ర్వాత ప‌లు సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించి మంచి స్టార్ డ‌మ్ సంపాదించుకున్నాడు. లాక్‌డౌన్ స‌మ‌యంలో షూటింగ్స్ నిలిచిపోవ‌డంతో ఇంటి ప‌ట్టునే ఉండి సొంత ప‌నులు చేసుకుంటూ బిజీగా గ‌డిపాడు. ఈ న‌టుడు మ‌ళ్లీ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. బ‌జార్ రౌడీతో స్టెప్ప‌లేయించిన కొరియోగ్రాఫ‌ర్ ప్రేమ్ ర‌క్షిత్ అంటూ ట్విట‌ర్ లో షూటింగ్ లొకేష‌న్ ఫొటోల‌ను బీఏ రాజు షేర్ చేశారు.

బ్లాక్ అండ్ యెల్లో కాంబినేష‌న్ డ్రెస్ స్టైలిష్ గాగుల్స్ పెట్టుకున్న సంపూ ప్రేమ్ ర‌క్షిత్ సూచ‌న‌లు వింటుండ‌టం స్టిల్స్ లో చూడొచ్చు. మ‌రో వైపు బ్యాక్ డ్రాప్ లో డ్యాన్స‌ర్ల బృందం కూడా కనిపిస్తోంది. ఈ ఫొటోలు ఇపుడు ఆన్ లైన్ లో హ‌ల్ చల్ చేస్తున్నాయి. సంపూర్ణేశ్ సినిమా అంటే కామెడీకి కొద‌వ ఉండ‌ద‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. సంపూ కొత్త సినిమా టైటిల్ బ‌జార్ రౌడీ అని ట్వీట్ ద్వారా తెలుస్తోంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.